ETV Bharat / state

గోదావరి ప్రక్షాళనకు అడుగులు.. - central governament dicided to purage godavari

కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది. రూ.1,200 కోట్లతో రూపొందించిన ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. గంగానది తర్వాత అంతటి ప్రాశస్త్యం గల గోదావరి ప్రక్షాళనకు అడుగులు పడుతున్న వేళ సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

రాజమహేంద్రవరం మార్కండేయఘాట్‌లో కలుస్తున్న మురుగు

author img

By

Published : Oct 1, 2020, 11:34 AM IST

రాజమహేంద్రవరం మార్కండేయఘాట్‌లో కలుస్తున్న మురుగు

అఖండ గోదావరి ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది. రూ.1,200 కోట్లతో రూపొందించిన ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. తొలివిడతగా రూ.419 కోట్ల నిధుల మంజూరుకు పాలన అనుమతి వచ్చింది. మిగిలిన నిధులు దశల వారీగా విడుదల చేయనుంది. గంగానది తర్వాత అంతటి ప్రాశస్త్యం గల గోదావరి ప్రక్షాళనకు అడుగులు పడుతున్న వేళ సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
కలుషితం.. కలవరం:

తూర్పుగోదావరి జిల్లాలో చెత్త నిల్వకు డంపింగ్‌ యార్డులు లేక కాలువ గట్లు పూర్తిగా వ్యర్థాలతో నిండాయి. దీంతో 431 కి.మీ పంట కాలువలు, 2,024 కి.మీ పిల్ల కాలువలు కాలుష్యానికి నెలవయ్యాయి. మళ్లీ అదే నీటిని సాగు అవసరాలకు వాడటం పరిపాటిగా మారింది. సామర్లకోట, కాకినాడ కెనాల్‌ పరిధిలో పరిశ్రమల నుంచి రసాయనాలు, వ్యర్థాలు నేరుగా నదిలోకి వదిలేస్తున్నారు. రాజమహేంద్రవరంలో పరిశ్రమల వ్యర్థాలు వెంకట నగరం వద్ద నదిలో చేరుతున్నాయి. దశాబ్దాలుగా ఇదే తీరుతో 40 శాతం నీరు పరిశ్రమల వ్యర్థాలతో కలుషితమైంది.
సురక్షితం.. సంశయమే:

రాజమహేంద్రవరంలో 4.5 లక్షల జనాభా ఉన్నారు. నిత్యం 74 ఎంఎల్‌డీ నీటిని గోదావరి నుంచి సేకరించి సరఫరా చేస్తున్నారు. పుష్కర ఘాట్‌ వద్ద-54, ఆల్కట్‌ గార్డెన్స్‌-10, కోటిలింగాల ఘాట్‌ -10 ఎంఎల్‌డీ ప్లాంట్లు ఉన్నాయి. రాజమహేంద్రవరంలో నల్లాలు, ఆవ ఛానల్‌ ద్వారా గోదావరిలో రోజుకు 60 ఎంఎల్‌డీ మురుగు కలుస్తోంది. నదిలో పీహెచ్‌ విలువ 6.5-7.5 మధ్య ఉంటేనే తాగు అవసరాలకు వాడాలి. అయితే 2011-12లో జాతీయ నదులపై జరిగిన సర్వేల ప్రకారం పీహెచ్‌ విలువ 3.6 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అదే కార్బన్‌డయాక్సైడ్‌ 18.22 శాతం ఉన్నట్లు నిర్ధారించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నీటిని శుద్ధీకరించి సరఫరా చేస్తున్నా.. పూర్తి ల్యాబ్‌లు అందుబాటులో లేవు. వెరసి 50 శాతం జనాభా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లపై ఆధారపడి.. ఒక్కో కుటుంబం నెలకు రూ.వెయ్యి వెచ్చిస్తోంది.
మూడు పద్ధతుల్లో..:

గోదావరిని మూడు విధానాల్లో శుద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామీణ పారిశుద్ధ్యం, మురుగు, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధీకరణకు ప్రాధాన్యం కల్పించారు. నగరంలోని మురుగు నదిలో నేరుగా కలవకుండా కాతేరు, లాలాచెరువు, ధవళేశ్వరం, ఆవ ప్రాంతాల్లో మురుగు శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. రాజమహేంద్రవరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించి.. కలుషిత వ్యర్థాలు నదిలో కలవకుండా గోదావరికి సమాంతరంగా టన్నల్‌ను నిర్మించి సముద్రానికి వెళ్లే పాయలో కలపనున్నారు. కాలువ గట్లను ఆధునికీకరణ చేయనున్నారు. కాలువలను అన్ని విధాలుగా బాగు చేసి.. ఆవాస ప్రాంతాల్లో కాలువల వద్ద పార్కులుగా తీర్చిదిద్దినున్నారు.
దశల వారీగా పనులు ..
గోదావరి ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం జలశక్తి పథకం ద్వారా రూ.1,200 కోట్ల ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రతిపాదించగా సమ్మతించింది. ఇప్పటికే రూ.419 కోట్ల నిధులకు ఎన్‌ఆర్‌సీడీ ఆమోదం లభించింది. మినిస్ట్రీ ఆఫ్‌ జలశక్తి ద్వారా నిధులు విడుదల చేయాల్సి ఉంది. మురుగు శుద్ధీకరణకు అవసరమైన చోట ఎస్టీపీ ప్లాంట్‌ల నిర్మాణం, కాలువల ఆధునికీకరణ చేపట్టనున్నాం. రాజమహేంద్రవరంలో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయనున్నాం. - మున్సిపల్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌
పాలన అనుమతులు మంజూరు
పార్లమెంట్‌లో ఇదే అంశంపై ప్రస్తావించా. ప్రాజెక్టును నివేదించగా, ప్రధాని స్పందించి ఎన్‌ఆర్‌సీడీ ద్వారా నిధులు విడుదలకు సమ్మతించారు. తొలి విడత నిధులకు పాలన అనుమతులు వచ్చాయి. ఇప్పటికే అమృత్‌ నిధులతో నగరంలో ముంపు సమస్య పరిష్కరించే పనులు జరుగుతున్నాయి. ఇక కాలుష్య నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా దశల వారీగా పనులు చేపట్టనున్నాం. - మార్గాని భరత్, ఎంపీ
గోదావరి పొడవు : 1,465 కి.మీ
పరివాహక ప్రాంతం : 3,12,812 కి.మీ
రాజమహేంద్రవరం వద్ద వెడల్పు : 4 కి.మీ
డెల్టా పంట కాలువలు : 2,455 కి.మీ

ఇదీ చదవండి

ఇసుక అక్రమ రవాణా.. పోలీసుల అదుపులో 23 మంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.