తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని ఉడుమూడిలంక గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన మద్దా ఆది సుబ్బారావు అనే రైతుకు చెందిన పశువుల పాక దగ్ధమైంది. పశువుల పాకలో ఉన్న పాడి ఆవులు, ఒక గేదె, దూడ సజీవ దహనమయ్యాయి. పి.గన్నవరంలో సబ్ ఇన్స్పెక్టర్ సురేంద్ర ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతి చెందిన పశువులను చూసి రైతు సుబ్బారావు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి: