ETV Bharat / state

ఒక్క అవకాశం ఇవ్వండి.. స్వతంత్ర అభ్యర్థి కోసం తల్లి, భార్య ప్రచారం - పుదుచ్చేరిలో ఎన్నికలు

యానాంలో ఎన్నికల ప్రచార వేడి పెరుగుతోంది. ఆ అత్తాకోడళ్లు ఇద్దరూ ఇంటిని చక్కబెట్టుకుంటూ వచ్చారు ఇంతకాలం. ఇప్పుడు... ఊరిని చక్కబెట్టడానికి రాజకీయ ప్రవేశం చేసిన యువకుడి కోసం... ఇల్లిల్లూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. యానాం అసెంబ్లీ ఎన్నిక సందర్భంగా ఇండిపెండెంట్​ అభ్యర్థిగా బరిలో నిలిచిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కుటుంబ సభ్యులు.. తమ ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు.

campaign for yanam assembly election
యానాంలో ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 31, 2021, 5:28 PM IST

కేంద్ర పాలిత ప్రాంతం యానాం అసెంబ్లీ ఎన్నికల్లో.. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్.. ఇండిపెండెంట్​గా బరిలో నిలిచారు. ఆయన తండ్రి గొల్లపల్లి గంగాధర ప్రతాప్.. 15 ఏళ్ల క్రితం యానాం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఓ సారి, భాజపా అభ్యర్థిగా మరోసారి పోటీ చేసినా.. ఓడిపోయారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం పొందారు. ఇప్పుడు ఆయన తనయుడైన శ్రీనివాస్ అశోక్.. తండ్రి మాదిరిగానే స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

శ్రీనివాస్ అశోక్ తరఫున అతని తల్లి, భార్య.. ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఓటు వేసి గెలిపించాలంటూ.. విస్తృత ప్రచారం చేస్తున్నారు. పుదుచ్చేరి మాజీ సీఎం, కాంగ్రెస్ పుదుచ్చేరి అధ్యక్షుడు రంగస్వామిపై పోటీలో నిలబడిన అశోక్ కు విజయాన్ని అందించాలని కోరుతున్నారు. పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. యానాం నియోజకవర్గానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి సుంకర కార్తీక్, ఇండిపెండెంట్ అభ్యర్థులు దుర్గాప్రసాద్, దవులూరి మాత్రమే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు కనీసం కరపత్రాలు కూడా ప్రచురించలేదు.

ఇదీ చూడండి:

'తలనీలాల వ్యవహారంపై తితిదే శ్వేతపత్రం విడుదల చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.