భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసేవి గ్రామీణ క్రీడలేనని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. మంగళవారం రాజానగరం మండలం వెలుగుబండ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా దేవర్షి డెవలపర్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పరుగు పందెం పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాజరయ్యారు.
ప్రాచీన క్రీడలను ప్రోత్సహిస్తున్న దేవర్షి డెవలపర్స్ వారిని ఎమ్మెల్యే అభినందించారు. సంక్రాంతి పండుగ దేశమంతటా జరుపుకొంటున్నారని... మన సంస్కృతిలో హరిదాసులు, గంగిరెద్దులు, ఎడ్ల బండ్ల పోటీలు ఒక భాగాలన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ఎద్దుల బండి పోటీలో ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: శాస్త్రీయ నృత్యంపై ఆసక్తి చూపుతున్న మహిళలు