పశ్చిమగోదావరి జిల్లా, ఇరగవరంలో గోస్తాని కాలువలో ఓ యువకుడు గల్లంతైయ్యాడు. వేల్పూరు ధనరాజు అనే యువకుడు స్నేహితులతో కలిసి తణుకు గోస్తాని కాలువలో ఈతకు దిగాడు. కొద్దిసేపటికి ప్రవాహం పెరగడంతో నీటి ఉధృతికి ఆ యువకుడు కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికి సాధ్యంకాలేదు. ఈ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. తమ కుమారుడు బతికే ఉంటాడు కదా..! అని అందరిని ప్రశ్నిస్తున్న వైనం..స్థానికులను కంటతడిపెడుతోంది.
ఇదీ చూడండి