ETV Bharat / state

శిశువు మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన - జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి

శిశువు మృతికి ఆసుపత్రి సిబ్బంది కారణమంటూ బంధువులు ఆందోళన చేసిన ఘటన.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగింది. వైద్యుడి బదులు నర్సు ప్రసవం చేయడం వలనే మృతిచెందిందంటూ వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

born baby died in jaggampet east godavari district
శిశువు మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
author img

By

Published : May 26, 2020, 10:23 PM IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిచెందింది. శిశువు మృతికి కారణం ఆసుపత్రి సిబ్బందే అంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గంపేట మండలంలోని మల్లిసాలకు చెందిన ముంతా మాధవి ప్రసవం కోసం గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరింది. అయితే రాత్రి సమయంలో విధుల్లో ఉండాల్సిన వైద్యుడు లేకపోవటంతో.. నర్సు శ్రీదేవి ఆమెకు డెలివరీ చేయగా శిశువు మృతిచెందింది. దీంతో కంగారు పడిన ఆసుపత్రి సిబ్బంది తల్లిని, శిశువును ఇంటికి పంపించారు.

మాధవి తండ్రి ఆసుపత్రికి వచ్చి వైద్యులు చేయాల్సిన ప్రసవం నువ్వెందుకు చేశావని నర్సును ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్తోందని బాధితులు తెలిపారు. ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.

దీనిపై వైద్యుడు రమేశ్​ను ప్రశ్నించగా... తనకు నీరసంగా ఉండి ఇంటికి వెళ్లిపోయానని.. ప్రసవం చేసిన నర్సుకు ఎంతో అనుభవముందని తెలిపారు. తల్లి కడుపులోనే పేగు శిశువు మెడకు చుట్టుకోవటంతో మరణించిందని వివరణ ఇచ్చారు.

ఇవీ చదవండి... 14 వేల మందితో డిజిటల్ మహానాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.