తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామ సచివాలయం వాలంటీర్లు, సచివాలయం సిబ్బందితో బొమ్మూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయల్లో జరుగుతున్న దాడుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలను వారికి సీఐ లక్ష్మణ్ రెడ్డి వివరించారు. గ్రామ, వార్డు వాలంటీర్లుకు కేటాయించిన పరిసరాల్లో అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రార్థన ప్రాంగణంలో నిఘా నేత్రాలను అమార్చలి లేదా వాచ్మెన్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆయా ఆలయ నిర్వాహకులకు సూచించారు. దొంగతనాలు, దాడులను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా..?: ఎంపీ రఘురామ