తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరలోని జగన్నాథపురం వద్ద ఉప్పుటేరులో సిలిండర్ పేలి బోటు దగ్ధమైంది. సముద్రంలో వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది. జెట్టీ వద్ద బోటును నిలిపి ఉంచడంతో ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ లీకై పడవకు మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గ్రహించిన ముగ్గురు మత్స్యకారులు వెంటనే ఉప్పుటేరులో దూకి ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
ఇదీ చదవండి :