తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో గల్లంతైన మరో చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి విశాఖకు చెందిన మధుపాడ కుషాలిగా గుర్తించారు. మృతదేహాన్ని దేవీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రేపు ఉదయం చిన్నారి బంధువులు రాజమహేంద్రవరం రానున్నారు. ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యం కాగా.. మరో 15మంది జాడ తెలియాల్సి ఉంది. బృందాల గాలింపు 7వరోజు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: నిలిచిపోయిన బోటు వెలికితీత పనులు..కచ్చులూరులో 144 సెక్షన్