ETV Bharat / state

BJP: వైసీపీ ప్రభుత్వ అరాచకలపై వరుస చార్జీషీట్లతో ఉద్యమిస్తాం: బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం - ఏపీ బీజేపీ కోర్​ కమిటీ సమావేశం వార్తలు

BJP State Core Committee: వైసీపీ ప్రభుత్వం అరాచకలను, అవినీతిని ప్రజలలో ఎండగట్టేందుకు ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం ప్రకటించింది. ప్రజలకు శుష్క హామీలను ఇచ్చి మభ్యపెడుతోందని.. ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే నెల్లో వరుస చార్జీషీట్లను తీసుకొస్తామని బీజేపీ నేతలు వెల్లడించారు.

BJP AP Core Committee
BJP State Core Committee
author img

By

Published : Apr 22, 2023, 10:37 PM IST

BJP State Core Committee Meeting : అధికార వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలలో ఎండగడతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీ దోపిడి, అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని, పోరాటానికి సమరశంఖం పూరించాలని కోర్​ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్రమంత్రి మురళీధరన్, దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీలు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపార వేత్త తులసి రామచంద్రప్రభు.. ఆయన కుమారుడితో కలిసి బీజేపీలో చేరారు.

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసి అధోగతి పాలు చేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి చేస్తున్న అరాచకలను ఎండగట్టాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించిందని వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామనే హామీని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. అభివృద్ధి చేస్తామని వైసీపీ ప్రభుత్వం శుష్క వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో ఛార్జిషీట్లు వేసి ఆధారాలతో ప్రజల్లో ఎండగట్టటమే బీజేపీ లక్ష్యమని వివరించారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో హామీలు ఇచ్చి.. నెరవేర్చని వాటిని ప్రజలలోకి తీసుకువెళ్తాము. ఎమ్మెల్యేల తీరుతో కుంటుపడిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తాము. జగనన్న కాలనీల పేరుతో స్థానిక నేతలు.. ఆ పథకాలలో ఎలా భాగస్వాములై అవినీతికి పాల్పడ్డారో ప్రజల దృష్టికి తీసుకు వెళ్తాము.

మద్య నిషేదం నవరాత్నలలో భాగమని మద్యాన్ని నిషేదించకుండా.. ఏరులై పారేలా వైసీపీ ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు. మద్యాన్ని తన సిండికేట్​ ద్వారా విక్రయిస్తూ.. ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నా తీరుపై ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. దీనికోసం మే 5వ తేదీ నుంచి 15 తేదీ వరకు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జీషీట్లు తీసుకువస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.