అన్నదాతలను కష్టాల నుంచి గట్టెక్కించడానికే మోదీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి మాలకొండయ్య వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో ఏర్పాటు చేసిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతులు స్వేచ్ఛగా పంటలు అమ్ముకునే విధంగా కేంద్రం చట్టాలు చేస్తే..కొందరు రాజకీయ నాయకులు రైతుల ముసుగులో కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి నడిపిస్తున్న ఉద్యమం తప్ప రైతులు చేస్తున్న ఉద్యమం కాదని విమర్శించారు.
ఇదీచదవండి