తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్య రథం దగ్ధం ఘటనకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో అరెస్టయిన 37 మంది కాకినాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన భాజపా, జనసేన, ధార్మిక సంఘాల ప్రతినిథులకు.. నాయకులు ఘన స్వాగతం పలికారు. వారందరూ జైలు నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, భాజపా, హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు. దేవాలయాలపై దాడులు అమానుషమని.. ఆస్తులు అన్యాక్రాంతం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు.
ఇవీ చదవండి..