తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలంలో ఉన్న భూపతి జలాశయం నుంచి ఆరుగేట్లు ఎత్తి నీటని విడుదల చేశారు. సీతపల్లి వాగులోకి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు జలాశయం ఏఈ చంద్రకాంత్ తెలిపారు.
దిగువన ఉన్న సీతపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించటంతో రంప తదితర గ్రామాలకు వెళ్లే రహదారుల వంతెనపై నుంచి నీరు ప్రవహించింది. పందిరి మామిడి వద్ద వంతెన మునిగి రాకపోకలు స్తంభించాయి. కొన్ని చోట్ల కొండ కాలువ కల్వర్టులు తెగిపోయాయి.
ఇదీ చదవండి: