తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లోని 16 మండలాలతో పాటుగా అమలాపురం మున్సిపాలిటీ, ముమ్మడివరం నగర పంచాయతీలో12 వేల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులు బిల్లుల కోసం ఏడాది కాలంగా పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం బలహీనవర్గాలకు 2016-17 నుంచి 2019-20 వరకు 12 వేల మంది లబ్ధిదారులకు పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. వీరికి 20 కోట్ల రూపాయల మేర బిల్లులు ప్రభుత్వం ద్వారా చెల్లింపులు జరగాల్సి ఉంది. గతేడాది మార్చి 31 వరకు కొంత వరకు బిల్లులు చెల్లించారు. ఏప్రిల్ 1 నుంచి నేటి వరకు బిల్లులు రాలేదు. ఇప్పటికైనా బిల్లులు మంజూరు చేయాలని లబ్ధిదారులు మొర పెట్టుకుంటున్నారు.
దీనిపై అమలాపురం డివిజన్ హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. గణపతిని ఈటీవీ భారత్ వివరణ కోరగా.. 12 వేల మంది లబ్ధిదారులకు చెల్లించాల్సిన 20 కోట్ల మేర బిల్లులు తయారు చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. మంజూరు కాగానే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: మట్టి తవ్వకాల్ని అడ్డుకున్న యువత