ఫ్యాక్టరీలో మహిళా కార్మికులకు కనీస వసతులు కల్పించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. తూర్పుగోదావరి జిల్లా కోప్పవరం బీడీఎచ్ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో పనిచేసే మహిళలు ఆందోళన చేపట్టారు. తాము పనిచేసే చోట కనీస వసతులు లేవన్నారు. జీతాలు పెంచేవరకు విధులకు హాజరవ్వమంటూ ఫ్యాక్టరీ గేటు ముందు నిలబడి నినాదాలు చేశారు.
విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ వెంకటరామకృష్ణారెడ్డి వచ్చి లేబర్ కాంట్రాక్టర్‌తో సమస్యపై చర్చించారు. ఈనెల 25న గ్రామపెద్దలతో చర్చించి సమస్య పరిష్కారిస్తామని చెప్పటంతో మహిళలు నిరసన విరమించి విధులకు హాజరయ్యారు.
ఇవీ చదవండి...