తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట లయన్స్ క్లబ్లో భాజపా నేతలు శిక్షణ శిబిరం నిర్వహించారు. సమావేశంలో భాగంగా పార్టీ సంస్థాగత విషయాలు, విధి విధానాలు, వ్యక్తిత్వ వికాసం, సమాజ నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమంపై అవగాహన కల్పిస్తామని శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంధీ తెలిపారు.
వాటిపై అవగాహన పెంచుకోవడమంటే..
ఈ రెండు రోజులు శిక్షావర్గ్ ద్వారా గ్రామ స్థాయి నుంచి పార్టీ సిద్ధాంతాలపై అవగాహన పెంచుకోవడమంటే.. కార్యకర్తలు తమ సమయం వెచ్చించి సమాజ నిర్మాణం కోసం సమష్టిగా పని చేయాలని దిశానిర్దేశం చేయడమేనన్నారు. కార్యక్రమంలో భాజపా అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ ఇతర నాయకులు పాల్గొన్నారు.