ఉభయ గోదావరి జిల్లాల్లో సత్వర సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నట్లు హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సుచరిత తెలిపారు. రెండు జిల్లాల్లో 280 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయన్నారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయ, పునరావాస పనులను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఎన్డీఆర్ఆఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహయక చర్యలో పాల్గొన్నయన్న హోంమంత్రి... క్షేత్రస్థాయిలో సహాయ చర్యల కోసం విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా రూ.2 కోట్లు విడుదుల చేసినట్లు వెల్లడించారు.
ఇదీచదవండి