ETV Bharat / state

నూతన చట్టంతో ఆక్వా రంగానికి భరోసా! - ఆక్వా రంగానికి కొత్త చట్టం

ఆటుపోట్ల నడుమ అల్లాడుతున్న రొయ్యల రైతులకు కరోనా భారీగా కుదిపేసింది. అమ్మకాలతోపాటు ఎగుమతులపైనా ప్రభావం పడింది. దీంతో రొయ్యల సాగు చేస్తున్న రైతులతో పాటు రొయ్య పిల్లలు, మేత సరఫరా చేసే వ్యాపారులు కొంతకాలంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆక్వా ఉత్పత్తుల కారణంగా విదేశీ మారకద్రవ్యం భారీగా సమకూరుతున్న క్రమంలో ఈ పరిశ్రమ కష్టాలకు తెరదించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది.

royya rythu
royya rythu
author img

By

Published : Jun 15, 2020, 8:49 AM IST

కొత్త చట్టంతో భరోసా దిశగా ఆక్వా రంగానికి మేలు జరగనుంది. కరోనా దెబ్బతో అల్లాడిపోయిన రొయ్యల రైతులను ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంటు అథారిటీ చట్టం- 2020 ముసాయిదాను రూపొందించింది. దీనిపై రొయ్యల సాగు రైతులు, ఇతర భాగస్వాముల సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది.

ఇదీ లెక్క...

జిల్లాలోని ఆక్వా జోన్లలో రొయ్యల సాగు 17,878.11 హెక్టార్లలో సాగుతోంది. అనధికారిక సాగు మూడువేల హెక్టార్లకు పైనే ఉంది. రొయ్యల రైతులు 12,758 మంది ఉన్నారు. వీటికి సంబంధించి ప్రాసెసింగ్‌ యూనిట్లు 14 ఉంటే.. వీటి ద్వారా రోజువారీ 899 మెట్రిక్‌ టన్నుల రొయ్యలను శుద్ధి చేస్తున్నారు. 27,427 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో జిల్లాలో 14 శీతల గిడ్డంగులు 14 ఉన్నాయి. 190 హేచరీల్లో 30 నుంచి 35 బిలియన్ల రొయ్య పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు. రొయ్యల మేత యూనిట్లు జిల్లాలో నాలుగు ఉన్నాయి. ఏటా లక్ష టన్నుల వరకు రొయ్యలను ప్రాసెసింగ్‌ యూనిట్లలో శుద్ధిచేసి అమెరికా, చైనా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కరోనా కుదుపు కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయి. రొయ్యల సాగుపైనా పెను ప్రభావం పడి ఈ పరిశ్రమపై ఆధారపడే వారు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిస్థితిపై దృష్టిసారించింది. లాక్‌డౌన్‌ ఆంక్షల తొలగింపు అనంతరం పరిస్థితి కొంత కుదుటపడే పరిస్థితి కనిపిస్తోంది.

సమస్యలు అధిగమిస్తే..

ఆక్వా రైతులు సాగు క్రమంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న క్రమంలో రైతులకు కావాల్సిన ఇన్‌పుట్స్‌ సకాలంలో అందిస్తే ఫలితం ఉంటుందన్న వాదన ఈ పరిశ్రమపై ఆధారపడిన వారి నుంచి వినిపిస్తోంది. రొయ్య పిల్లలు, మేత నాణ్యతతో అందితే రైతు పండించే పంటకు కూడా మంచి గిట్టుబాటు దక్కే అవకాశం ఉంది. మేత ధరలు సాగు రైతులకు భారంగా మారుతున్నాయి. ధర స్థిరీకరణకు ప్రభుత్వం చొరవ చూపడంతోపాటు.. నాణ్యమైన సరకు అందేలా చొరవ చూపితే ఉత్పత్తి భారం రైతులకు తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా ధరల విషయంలో నష్టపోయే పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేయాలన్నది పలువురి సూచన. కొవిడ్‌ లాంటి అత్యయిక పరిస్థితుల్లో చేతికందిన పంట నిల్వచేసే క్రమంలో రైతాంగం, ఇతర వ్యాపారులు అవస్థలు పడ్డారు. జిల్లాలో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడమే ఈ పరిస్థితికి కారణం. ప్రభుత్వం చొరవ తీసుకుని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా మైనస్‌ 18 నుంచి 20 డిగ్రీల సామర్థ్యంతో శీతల గిడ్డంగులు అందుబాటులోకి తెస్తే బాగుంటుందని కోరుతున్నారు.

పర్యవేక్షణతో ముందుకు..

కొత్త చట్టం ఆమోదం పొందాక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ.. ఆ తర్వాత స్థాయిలో ఆదేశాల అమలుకు కార్యనిర్వాహక కమిటీ.. మరో స్థాయిలో సాంకేతిక కమిటీలు ఏర్పాటై.. ఆక్వారంగం సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్‌ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటై క్షేత్రస్థాయిలో ఏ తరహా సహాయం అవసరమనే అంశంపై ఆరా తీసి చర్యలు చేపడతారు. క్రమబద్ధీకరణ, ఇతరత్రా అంశాలపైనా నిర్ణయాలు ఉంటాయి. తాజా పరిణామాలు ఏమేరకు ఆక్వా రంగానికి ఉపకరిస్తాయన్న ఆసక్తి ఆయా రంగంపై ఆధారపడినవారిలో నెలకొంది. కసరత్తు దశలో ఉన్న కొత్త చట్టం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: 'హెలికాప్టర్ షాట్​ కోసం అంతలా కష్టపడ్డాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.