అప్పట్లో రాజధాని విషయంలో చంద్రబాబు తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో జగన్ అమరావతిని రాజధానిగా స్వాగతించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు రెండు విఫలమయ్యాయాని ఆరోపించారు.
ఇదీ చదవండి: దినదినగండం.. మృత్యువుతో పోరాటం