చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. కడప జిల్లా రాయచోటిలోని విద్యాశిక్షణ సంస్థ కేంద్రంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. తెలుగుదనం ఉట్టిపడేలా చీర, అంచు పంచెలు కట్టి ఆడిపాడారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, రావులపాలెంలోని ఉన్నత పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గొబ్బెమ్మలను పెట్టి పూజలు చేశారు. వాటిచుట్టూ పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో ప్రజలు జరుపుకునే తీరుతెన్నులు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలోని రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. కొన్ని ముగ్గులు సేవ్ ద చైల్డ్, సేవ్ ద ఉమెన్ నినాదాలతో సందేశాత్మకంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: