తూర్పుగోదావరి జిల్లాలోని దివిస్ పరిశ్రమ కాలుష్యంపై తీవ్రస్థాయిలో వివాదం అవుతుండటంతో ఆ సంస్థకు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ రాసింది. స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపే ఎలాంటి వ్యర్ధాలు విడుదల చేయొద్దని ఆ శాఖ డైరెక్టర్ దివిస్ యాజమాన్యాన్ని ఆదేశించారు. దివిస్ పరిశ్రమకు స్థలం ఇచ్చిన ప్రాంతంలో ఆక్వా హెచరీలు ఉన్నాయని కాలుష్య ప్రభావంతో అవి ఇబ్బందులు ఎదుర్కోనే ప్రమాదముందని లేఖలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.
హేచరీలు నష్టపోతే వీటి కారణంగా పెద్ద ఎత్తున ఉపాధి పొందిన గ్రామీణ యువత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రావొచ్చని లేఖలో పరిశ్రమల శాఖ పేర్కొంది. హేచరీలు మూత పడితే స్థానిక యువత ఉపాధినే కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. కాలుష్య నివారణ చర్యలు చేపట్టకుండా వ్యర్థాలు విడుదల చేయడం సరికాదని పరిశ్రమల శాఖ లేఖలో పేర్కొంది.
ఇదీ చదవండి: