కరోనాను సీఎం జగన్ తేలిగ్గా తీసుకుంటున్నారని... తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించడం తగదని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. కరోనాను సమర్ధంగా ప్రభుత్వం ఎదుర్కొంటూ, పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని... ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంటే దీన్ని రాజకీయం చేయాలని తెదేపా నాయకులు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది సరికాదని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: