తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనలో దేవస్థానం ఈవో ఎన్. ఎస్. చక్రధర్పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
దేవాలయ పరిసరాల పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడం తప్పిదమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా విధుల నుంచి తప్పించినట్టు దేవాదాయ శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: