అంతర్వేది రథం నిర్మాణ కమిటీ ఛైర్మన్ హోదాలో హిమాన్షు కౌశిక్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరిలో స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని రథం నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అంతర్వేదికి వెళుతున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య కల్యాణ రథం దగ్ధం అయిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు వెళుతున్న సాధువులు, హిందూ పరిరక్షణ సమితి సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురంలో 25మందిని అదుపులోకి తీసుకుని వీరిని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్‌లకు రావులపాలెం మీదుగా తరలించారు. ఈ నేపథ్యంలో తమను ఎక్కడికి తీసుకెళ్తున్నారని.. తాము విజయవాడ వెళ్తామని రావులపాలెంలోని వారి వాహనాలను నిలుపుదల చేసి నిరసన తెలిపారు. రావులపాలెం సీఐ వి.కృష్ణ, ఎస్సై బుజ్జిబాబులు వీరిని పలు వాహనాల్లో ఎక్కించి ఆలమూరుకు 9మంది, రామచంద్రాపురానికి 9మంది, తుని పోలీస్‌స్టేషన్‌లకు ఏడుగురిని తరలించారు.
ఇదీ చదవండి: 'ఎంపీల జీతాల్లో కోత' బిల్లుకు లోక్సభ ఆమోదం