తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం ఆలయాన్ని.. కేంద్ర ప్రభుత్వం 'ప్రసాద్' పథకంలో చేర్చింది. పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాల అభివృద్ధికి.. ఈ పథకం కింద నిధులు కేటాయిస్తారు. ప్రసాద్ పథకంలో.. అన్నవరం ఆలయాన్ని ఎంపిక చేయడంతో.. దేవస్థానంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలపై త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు. 2018లోనే.. ఓ కన్సల్టెన్సీ ద్వారా రూ.48కోట్ల 58 లక్షలతో చేసిన ప్రతిపాదనల్లో తాజాగా కొన్ని మార్పులు చేయనున్నారు. గతంలో సిద్ధం చేసిన ప్రణాళికలో ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా.. ప్రణాళికలో మార్పులు చేయనున్నారు. అన్నదాన భవనం, వ్రత మండపాలు, క్యూ కాంప్లెక్స్ తదితర వాటికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: