ETV Bharat / state

లాక్​డౌన్​ ప్రభావం... తగ్గిన అన్నవరం దేవస్థానం ఆదాయం

అన్నవరం సత్యదేవుని దేవస్థానం ఆదాయంపైనా కరోనా ప్రభావం పడింది. లాక్​డౌన్​ నేపథ్యంలో 2020౼21 ఆర్థిక సంవత్సరంలో ఆలయ ఆదాయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా వ్యయం విషయంలో జాగ్రత్తలు పాటించాలని దేవస్థానం ఈవో ఆదేశాలు జారీ చేశారు.

annavaram temple
తగ్గిన అన్నవరం దేవస్థానం ఆదాయం
author img

By

Published : Apr 30, 2020, 3:55 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంపై లాక్​డౌన్​ ప్రభావం పడింది. మార్చి 19 నుంచి సత్యనారాయణ స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో 2020౼21 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దర్శనాలు నిలిపి వేయడం వల్ల నెలకు సుమారు రూ. 10 కోట్లు ఆదాయం తగ్గుతుందని అంచనా. దీంతో స్వామి వారి పూజలు, ఇతర వైదిక కార్యక్రమాలు, ఉద్యోగుల జీతాలకు మినహా మిగిలిన వాటికి వ్యయం చేయకూడదని నిర్ణయించారు. ఆదాయం కుదుటపడిన తర్వాతే ఇంజినీరింగ్, ఇతర పనులు చేపట్టనున్నారు.

annavaram temple
తగ్గిన అన్నవరం దేవస్థానం ఆదాయం

ఇవీ చూడండి...

'లాక్​డౌన్​ సడలిస్తే రైలు నిలయంలో ఇలా ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.