తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో దివ్య రథం అగ్నికి ఆహుతి అయిన ఘటనతో అన్నవరం దేవస్థానంలో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం సమయంలో గ్రామోత్సవంలో వినియోగించే వెండి గరుడ, గజ, ఆంజనేయ వాహనాలు, పల్లకీలు ఇప్పటివరకు కొండ దిగువన వాహనాల సత్రం వద్ద హాలులో ఉంచగా భద్రతా పరంగా ఇబ్బందులను అధికారులు గుర్తించారు. వీటిని కొండపైకి తరలించి భద్రపరిచారు. అదేవిధంగా కొండ దిగువన ఉన్న చెక్క రావణబ్రహ్మ, పొన్న వాహనాలకు భద్రతా ఇబ్బందులు లేకుండా వాహనశాలకు భారీ గేట్లు అమర్చుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు భద్రత సిబ్బందిని నియమించారు.
ఇదీ చదవండి: