తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆలయ ఈవో త్రినాథరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఇరవై రోజుల్లో రూ.1.12కోట్లు ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. నగదుతో పాటు 61 గ్రాముల బంగారం, 348 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: చంద్రప్రభ వాహనంపై కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనం