తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. రూ. 81.67 లక్షలు సమకూరినట్లు పేర్కొన్నారు. ఈవో త్రినాథరావు పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, పలు దేశాల కరెన్సీ కూడా సమకూరినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: వీడియో: పోలింగ్ కేంద్రం దగ్గర డబ్బుల పంపిణీ !