ETV Bharat / state

అనపర్తి గ్రామ సచివాలయం-3 వీఆర్వో తాత్కాలిక సస్పెన్షన్​

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామ సచివాలయం-3 వీఆర్వోను సస్పెండ్ చేస్తూ అనపర్తి తహసీల్దార్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో వెల్లడించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్​కు ఫిర్యాదులు అందాయని.. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

anaparthi vro suspended
అనపర్తి గ్రామ సచివాలయం-3 వీఆర్వో సస్పెండ్
author img

By

Published : Jun 30, 2021, 3:45 PM IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామ సచివాలయం-3 వీఆర్వోగా పని చేస్తున్న వెంకన్న బాబును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు అనపర్తి తహసీల్దార్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. వివిధ రెవెన్యూ పనులు చేసేందుకు గ్రామంలోని రైతులు, ప్రజల నుంచి వెంకన్నబాబు అక్రమంగా అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్​కు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. దానిపై స్పందించిన కలెక్టర్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీఆర్వోను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు.

ఇదీ చదవండి:

COVID VACCINE: రాష్ట్రానికి మరో 6 లక్షల కొవిడ్ టీకా డోసులు

brahmamagari pitham: బ్రహ్మంగారి పీఠంపై తెగని పంచాయితీ.. హైకోర్టుకు చేరిన వివాదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.