Amaravathi JAC: అమరావతి రాజధాని సాధన కోసం త్వరలో మహా పాదయాత్ర చేపడతామని.. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఐకాస ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, రైతు సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఇదీ చదవండి:
అంగన్వాడీ కేంద్రంలో అహారం తిని 14 మంది చిన్నారులకు అస్వస్థత