మహాశివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఇమ్మిడివరప్పాడు, రంగాపురం గ్రామాల్లో వీరభద్రుని కొలిచారు. ఇందులో భాగంగా అలుగుల సంబరం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు త్రిశూల ఆకారంతో ఉన్న అలుగులను ముఖం, కంఠం భాగంలో గుచ్చుకుని ట్రాక్టర్లపై ఊరేగారు. శరభ శరభ అంటూ వీరభద్రుని స్మరణలతో ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: మహాశివరాత్రి పర్వదినం..పులకించిన భక్తకోటి