ETV Bharat / state

ఫిర్యాదులపై అనిశా అధికారుల విచారణ - acb raids on tuni acb office

తుని ఎంపీడీవో కార్యాలయంలో అనిశా అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ సిబ్బంది లంచం అడిగారని ఫిర్యాదుల రాగా.. విచారణ చేపట్టినట్లు ఏసీబీ సీఐ తిలక్ చెప్పారు.

అనిశా అధికారుల విచారణ
తునిలో అనిశా అధికారుల విచారణ
author img

By

Published : Jun 30, 2021, 10:54 AM IST

ప్రభుత్వ సిబ్బంది లంచం అడిగారని వచ్చిన ఫిర్యాదులపై అనిశా అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని గవరపేట గ్రామానికి చెందిన ఆళ్ల మంగరాజు ప్రభుత్వం రాయితీ రూపంలో అందించే రూ. 6 లక్షలు మంజూరు చేసేందుకు ఏపీవో రాజ్‌గోపాల్‌ తన టెక్నికల్‌ అసిస్టెంట్‌ ద్వారా రూ.56 వేలు లంచం అడిగినట్లు బాధితులు 14400కి ఫోన్‌ చేసినట్లు ఏసీబీ సీఐ తిలక్ చెప్పారు.

ఈ ఘటన గత ఏడాది ఆగస్టులో జరిగిందని ఆయన తెలిపారు. నేటికీ ఉపాధి హామీ రాయితీ నిధులు మంజూరు చేయకపోవడంపై విచారణ చేపట్టామన్నారు. మండలంలోని ఎన్‌.సూరవరం గ్రామానికి చెందిన కొల్లు శ్రీను పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోగా ఆ గ్రామానికి చెందిన వీఆర్వో అరుణ రూ. 10 వేలు లంచం అడిగినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి నివేదికలను ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

రఘురామ స్వచ్చందంగా పార్టీ నుంచి తొలగిపోయినట్లే: ఎంపీ భరత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.