ETV Bharat / state

ఈత సరదా.. ఏలేరు కాలువలో యువకుడు గల్లంతు - నూకాలమ్మ జాతరలో విషాదం

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకొట వద్ద విషాదం నెలకొంది. స్నానం చేయడానికి సమీపంలోని ఏలేరు కాలువలోకి దిగిన ఐదుగురిలో ఒకరు నీటి ఉద్ధృతికి గల్లంతయ్యారు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

boy missing in eluru canal at kandrakota
ఏలేరు కాలువలో యువకుడు గల్లంతు
author img

By

Published : Apr 11, 2021, 9:44 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాండ్రకొట వద్ద ఏలేరు కాలువలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. అజయ్, జగదీశ్, శివాజీ, అర్జున్, చక్ర విష్ణు అనే ఐదుగురు యువకులు కాండ్రకొట నూకాలమ్మ జాతరకు వెళ్లారు. అమ్మవారి దర్శనం ఆనంతరం ఆలయానికి సమీపంలోని ఏలేరు కాలువలో స్నానం చేయడానికి దిగారు. ఈ క్రమంలో నీటి ఉద్ధృతికి నలుగురు ఒక్కసారిగా గల్లతయ్యారు. అయితే చక్ర విష్ణు అనే యవకుడు ప్రాణాలకు తెగించి గల్లంతైన నలుగురిలో ముగ్గురిని కాపాడాడు. ప్రమాదవశాత్తు అజయ్ ఆచూకీ దొరకలేదని విష్ణు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని అజయ్​ కోసం గాలిస్తున్నారు. యువకులు కాకినాడ, జగన్నాయక్​పురం, ఇంద్రపాలెంకు చెందినవారుగా గుర్తించారు.

ఇదీ చూడండి:

ఆంజనేయులు క్షేమం.. సీఎం ఇంటి వద్ద గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.