కరోనాతో కట్టడికి లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా.. పోలీసులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. మండుటెండలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను చూసి ఓ మహిళ చలించిపోయింది. ప్రైవేటు పాఠశాలలో రూ. 3,500 జీతానికి పనిచేస్తూ జీవనం సాగించే ఆమె... పోలీసులకు శీతల పానీయాలను అందించింది. మా కోసం మీరు ఎంతో కష్టపడుతున్నారంటూ వారికి ధన్యవాదాలు తెలిపింది. పోలీసుల పట్ల ఆమె చూపుతున్న అభిమానానికి సీఐ కిశోర్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. మీలాంటి వాళ్లను చూస్తే మాకు ఎంతో ధైర్యం వస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: