కనిపించకుండా పోయిన తన భర్త జాడ కనిపెట్టాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామానికి చెందిన నాగలక్ష్మి అనే మహిళ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడింది.
ఉత్తరకంచి గ్రామానికి చెందిన తన భర్త గంధం మరిడయ్యను బుధవారం మంతిన శ్రీను అనే వ్యక్తి బయటకు తీసుకెళ్లారని బాధితారులు వెల్లడించింది. అనంతరం వారివురూ ఊరకొండకు వెళ్లారని చెప్పింది. అయితే అక్కడ గ్రావెల్ తవ్వకాలను ఫొటో తీసినందుకు శ్రీనుపై కొంతమంది దాడి చేశారని నాగలక్ష్మి తెలిపింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి తన భర్త కనిపించటం లేదని బాధితురాలు చెప్పింది. ప్రత్తిపాడు పోలీసులకు తాను ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఆచూకీ కనిపెట్టి తనకు అప్పగించాలని కోరింది. మరోవైపు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీను ప్రత్తిపాడు సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు.