ETV Bharat / state

పొద్దునే లేస్తా.. చద్దన్నం తింటా.. సైకిలెక్కి పూలమ్ముతా..! - ap 2021 news

అరవై ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులతో బాధపడుతూ.. తమ పని తాము చేసుకునేందుకే ఇబ్బంది పడుతున్న రోజులివి. ఆయన మాత్రం ఉదయాన్నే లేచి సైకిల్‌ తొక్కుతూ పూలమ్మేందుకు వెళ్తాడు. రోజూ 50 కిలోమీటర్లు పైనే ప్రయాణిస్తూ.. పూలు విక్రయిస్తుంటాడు. దాదాపు 52 ఏళ్లుగా అతని దినచర్య ఇదే. శ్రమకై జీవన సౌందర్యాన్ని చాటుతున్న ఆ శ్రమజీవిపై కథనం.

a-person-selling-flowers-on-same-cycle-from-52-years-at-east-godavari
యాభయేళ్ల నాటి సైకిల్, అరెకరం పొలమే.. ఆ పూల వ్యాపారి ఆస్తి
author img

By

Published : Oct 26, 2021, 3:09 PM IST

యాభయేళ్ల నాటి సైకిల్, అరెకరం పొలమే.. ఆ పూల వ్యాపారి ఆస్తి

సైకిల్ తొక్కుకుంటూ ట్రాఫిక్‌లో దూసుకుపోతున్న ఈ పెద్దాయన పేరు ఆకుల వెంకట్రావు. సొంతూరు తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపు సావరం. పూల తోటలు, నర్సరీలకు ప్రసిద్ధిగాంచిన కడియం ప్రాంతంలో.. పూలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. పదకొండేళ్ల వయస్సులో పువ్వుల అమ్మకం మొదలుపెట్టినప్పటి నుంచి సైకిల్​పైనే ఊరూరా తిరుగుతూ విక్రయిస్తున్నారు. తొలి రోజుల్లో గోదావరిలో లాంచీపైన, ధవళేశ్వరం కాటన్ వంతెనపై నుంచి నిడదవోలు వెళ్లి పూలు అమ్మేవారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం మీదుగా కొవ్వూరు వరకూ వెళ్లి తన వ్యాపారం కొనసాగిస్తున్నారు.

గతంలో ఆనకట్ట మీద నుంచి వెళ్లి నిడదవోలులో అమ్ముకునేవాడిని. తర్వాత రాజమండ్రి బ్రిడ్జి కట్టారు. అప్పట్నుంచి రాజమండ్రి, కొవ్వూరులో పూలు అమ్ముతున్న. అప్పుడు రూపాయి పావలా వచ్చేది.. తర్వాత మూడు రూపాయాలు లాభమొచ్చేది. పొద్దున్నే చద్దన్నం తిని ఏడున్నర, ఎనిమిది మధ్యలో పూలు అమ్మడానికి వెళ్తాను. ఆ సైకిల్​తో నలుగురు పిల్లల పెళ్లి చేశారు. సైకిల్​ ఎలా వదులుతానండీ.. వదలను. మా పిల్లలు కాని బంధువులు కాని వస్తే సైకిలివ్వను.. కావాలంటే పది రూపాయలిత్తాను కానీ సైకిల్ మాత్రం ఇవ్వను. - వెంకట్రావు, పూలమ్మే వ్యక్తి

పూల వ్యాపారం చేస్తూ నలుగురు పిల్లల్ని పెంచి, పెద్ద చేశానని, అరెకరం భూమి కొని.. అందులో పూల తోట సాగు చేస్తున్నానని వెంకట్రావు తెలిపారు. పొద్దున్నే లేవటం.. పూలు కోసి, బుట్టల్లో సర్దుకుని సైకిల్‌పై తన ప్రయాణం సాగిస్తానని చెప్పారు. సుమారు యాభై ఏళ్ల క్రితం కొన్న సైకిల్​పైనే ఇప్పటికీ ప్రయాణిస్తున్న వెంకట్రావు.. తనకు ఆ సైకిల్​ ఎంతో అపురూపమంటున్నారు.

20 సంవత్సరాల నుంచి నాకు బాగా తెల్సండి. చాలా మంచోడు. సైకిల్ మీదే యాపారమండి ఆయనది. ఈ రోజుల్లో సైకిల్ మీద చేసినవాళ్లెవరున్నారండీ... బళ్లు కొనుక్కొని అమ్ముతున్నారు . ఆయన ఓపికకి మొచ్చుకోవచ్చండి. ఆ వయసులో అలా చేస్తున్నాడంటే. చాలా చక్కగా ఆరోగ్యంగా, గట్టి శరీరమండి ఆయనది. ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టే చేస్తున్నాడండి. ఈరోజుల్లో మనం చేయలేమండి.

-వరలక్ష్మి, రాజమహేంద్రవరం

30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నానండీ ఇతన్ని. గుడికేమో దండలు ఫ్రీగా వేస్తాడండి.

- వెంకటరమణ, రాజమహేంద్రవరం

వెంకట్రావు జీవనశైలి చూసి ఆశ్చర్యపోతుంటామని అతని వద్ద ఏళ్ల తరబడి పూలు కొనుగోలు చేసే దుకాణదారులు చెబుతున్నారు. అరవై ఏళ్లు పైబడినా.. ఇప్పటికీ సైకిల్ తొక్కుతూ పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తాడని అంటున్నారు.

ఇంచుమించు పాతిక ముప్పయేళ్ల నుంచి సైకిల్ తొక్కుకుంటూ పూలమ్ముతూ ఉంటుంటాడితను. చాలాకాలం నుంచి కష్టపడి తిరుగుతున్నాడు సైకిల్ మీద.

- పాండురంగారావు, రాజమహేంద్రవరం

కిలోమీటరు దూరం వెళ్లాలన్న వాహనాలను ఉపయోగిస్తున్న ప్రస్తుత కాలంలో.. దశాబ్దాలుగా సైకిల్‌పై ప్రయాణిస్తున్న వెంకట్రావు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి: చంకలో బిడ్డలు, భుజాలపై సంచులు.. వరద ప్రవాహంలో రాకపోకలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.