పోలీసులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ - ఏపీ కరోనా అప్డేట్స్
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ప్లాస్టిక్ డబ్బాలు అమ్మే వ్యాపారి శ్రీనివాసరావు... పోలీసులకు తనవంతు సాయం అందించారు. పోలీసులకు 36 హెల్మెట్లు, సబ్బులు, కూల్ డ్రింక్ బాటిళ్లు అందజేశారు. ఎస్ఐ శివ శంకర్ చేతుల మీదగా వీటిని పంపిణీ చేశారు. లాక్డౌన్ వేళ పోలీసులు తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారని... అందుకే తన వంతు సాయంగా వీటిని ఇచ్చినట్లు వ్యాపారి శ్రీనివాస్ తెలిపారు.
A MAN DISTRIBUTED HELMETS TO POLICE