ETV Bharat / state

40మంది సీపీఐ(ఎంఎల్​)లిబరేషన్​ కార్యకర్తల అరెస్టు - 40మంది సీపీఐ(ఎంఎల్​)లిబరేషన్​ కార్యకర్తలు

తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో వైకాపా నాయకుడు కర్రి మురళిపై జరిగిన దాడి కేసులో.. 40మంది సీపీఐ(ఎంఎల్​)లిబరేషన్​ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు.

సీపీఐ(ఎంఎల్​)లిబరేషన్
సీపీఐ(ఎంఎల్​)లిబరేషన్
author img

By

Published : Nov 6, 2021, 4:32 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరులో నిన్న వైకాపా నాయకుడు కర్రి మురళిపై జరిగిన దాడి కేసులో.. 40మంది సీపీఐ(ఎంఎల్​)లిబరేషన్​ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. అందులో 30మంది మహిళలు ఉన్నారు. వీరందరినీ కోటనందూరు పోలీస్ స్టేషన్​కు తరలించినట్టు సమాచారం.

గత పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో వైకాపా నాయకులతో, సీపీఐ(ఎంఎల్​)లిబరేషన్​ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. ఆ వివాదంలో మురళి ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు కర్రలతో సీపీఐ(ఎంఎల్​)లిబరేషన్ కార్యకర్తలపై దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో.. నిన్న వైకాపా నాయకుడిపై సీపీఐ(ఎంఎల్​)లిబరేషన్ కార్యకర్తలు మురళిపై దాడి చేసినట్టు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. సీపీఐ(ఎంఎల్​) లిబరేషన్ నాయకులు బంగార్రాజు సహా.. 40 మందిని అరెస్టు​ చేశారు. వీరి అరెస్టుకు నిరసనగా ఏలేశ్వరంలో లిబరేషన్ శ్రేణులు ధర్నాకు దిగాయి.

ఇదీ చదవండి: Suspicious Death: పదిరోజుల క్రితం అదృశ్యం.. నేడు మృతదేహం లభ్యం..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.