రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దేవీపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గండిపోశమ్మ ఆలయం వద్ద వరద నీరు మండపం పైవరకు చేరుకుంది.
ఎగువ కాపర్ డ్యాంపైన ఉద్ధృతంగా ప్రవహిస్తూ పి. గొందూరుకు వరదనీరు చేరుకుంటోంది. పరిహారం అందకపోవడంతో పోలవరం నిర్వాసితులు గ్రామంలోనే బిక్కుబిక్కుమంటూ కుటుంబీకులతో కలిసి కాలం వెళ్లదీస్తున్నారు.
ఇదీ చదవండి:
jagananna houses: ఇల్లు పూర్తవ్వాలంటే.. అప్పులపాలు కావాల్సిందే(నా?)..!