చిత్తూరు సహకార కేంద్ర బ్యాంకు ఎదుట వైకాపా నాయకుడు ధర్నా చేశారు. చంద్రగిరి మండలం కొటాలకు చెందిన వెంకిటీల మురళి బ్యాంకులో క్రాప్ లోనుతో పాటు ట్రాక్టర్ కొనుగోలు కోసం లోన్ తీసుకున్నారు. ట్రాక్టర్ లోన్ బకాయిలు వన్టైమ్లో చెల్లించారు. ఇందుకు సంబంధించి తాము ష్యూరిటీగా పెట్టిన కాగితాలు తీసుకునేందుకు నేడు బ్యాంకుకు వచ్చారు. అయితే క్రాప్ లోను కూడా చెల్లిస్తేనే డాక్యుమెంట్లు ఇస్తామని బ్యాంకు మేనేజర్ చెప్పారు. అలా కుదరదంటూ మురళి బ్రాంచ్ మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్యాంకు నిబంధనలను వివరిస్తూ మేనేజరు ఎంత సమాధానపరిచినప్పటికీ మురళి బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా అధికార పార్టీ నాయకుడు ఇలా ధర్నా చేయడం చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి...
శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై పునఃసమీక్షిస్తాం: వైవీ సుబ్బారెడ్డి