ETV Bharat / state

ఫ్యాన్ విజృంభనం.. చంద్రబాబుకి సైతం తగ్గిన ఆధిక్యం

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తెదేపాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ జోరుకు సైకిల్ స్పీడు తగ్గింది. అనూహ్యంగా చిత్తూరు జిల్లాలోనూ 13 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. కుప్పంలో చంద్రబాబు విజయంతో తెదేపా బోణీ కొట్టింది.

చంద్రబాబు
author img

By

Published : May 24, 2019, 8:51 AM IST

రాష్ట్రవ్యాప్తంగా వీచిన అనుకూల పవనాలను తెదేపా నిలువరించలేకపోయింది. తమ పార్టీకి కంచుకోటల్లాంటి జిల్లాలోనూ ఓటమి చవిచూడక తప్పలేదు. నాలుగు జిల్లాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేదంటే అధికార పార్టీ ఎంత విఫలమైందో అర్థం చేసుకోవచ్చు. చివరకి చంద్రబాబుకు సైతం మెజార్టీ దగ్గింది.
చిత్తూరులో ఫ్యాన్​ జోరు
చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభను ఈ ఎన్నికల్లో ఎంపీగా నిలబెట్టినందున అప్పటికప్పుడు మనోహర్​ను రంగంలోకి దింపింది తెదేపా. కేడర్​తో సర్దుకుపోయేందుకు సమయం లేనందున, తమిళ ఓటర్లను ఆకట్టుకోలేక వైకాపా అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల చేతిలో తెదేపా అభ్యర్థి ఓటమి పాలయ్యాడు.
మదనపల్లిలో నిలిచి... గెలిచి
మదనపల్లిలో బలమైన మైనార్టీ వర్గ ఓటర్లు అంతా వైకాపాకు జైకొట్టారు. వైకాపా అభ్యర్థి నవాజ్ బాషా కొత్త వ్యక్తి అయినా పార్టీ బలంతో గట్టెక్కారు. పార్టీ నేతల్లో సమన్వయ లోపం వల్ల తెదేపా నేత దమ్మలపాటి రమేశ్ ఓటమిపాలయ్యారు.
తంబళ్లపల్లిలో అసమ్మతి తోడై
తంబళపల్లిలో తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పనితీరుపై ఉన్న అసంతృప్తి ఓట్లలో కన్పించిందన్నది పార్టీ శ్రేణుల భావన. ఆయన్నే మరోసారి అభ్యర్థిగా ఖరారు చేసినందున వైకాపాకు బలం చేకూరింది. వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకా నాథ రెడ్డి తరఫున సోదరుడు రామచంద్రారెడ్డి అంతా తానై వ్యవహరించారు. తన అనుచరులను తంబళ్లపల్లికి పంపి పరిస్థితులను చక్కదిద్దినందున వైకాపా విజయం సులువైంది.
ఉత్కంఠ పోరులో భూమన గెలుపు
తెదేపా ఓడినా గట్టి పోటీనిచ్చిన నియోజకవర్గం తిరుపతి. తెదేపాకు తితిదే ఉద్యోగులు, మహిళల ఓట్లు అనుకూలంగా కనిపించాయి. చివరి వరకు నిరాశతో కనిపించిన భూమన.. చివర్లో ఎమ్మార్​పల్లి అండగా నిలిచినందున గెలిచారు.
చెవిరెడ్డి మళ్లీ
గట్టి పోటీ ఉంటుందని భావించిన చంద్రగిరిలో గెలుపు వైకాపా పక్షమైంది. ఎన్నికల ముందే ప్రణాళికతో రంగంలోకి దిగిన చెవిరెడ్డి ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టారు. పులివర్తి నాని ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. గ్రామీణ ఓటర్లు వైకాపా వైపు మొగ్గు చూపినందున విజయం వరించింది.
శ్రీకాళహస్తిలో సునాయాస గెలుపు
శ్రీకాళహస్తిలో ఓటమికి తెదేపా స్వయంకృత అపరాధమే కారణమన్న మాట వినిపిస్తోంది. సీనియర్ నేత బొజ్జల గోపాల్​రెడ్డికి అనారోగ్యం కారణంగా ఆయన కుమారుడు సుధీర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చినందునే ఓటమి వచ్చిందని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి తోడు వైకాపా అభ్యర్థి బియ్యపు మధుసూధన్ రెడ్డి గతంలో ఓడిపోయారనే సానుభూతి తోడై.. ఫ్యాన్ గాలి బలంగా వీచింది.
చంద్రబాబుకి తగ్గిన మెజార్టీ
చంద్రబాబునాయుడుకు మెజార్టీ గతం కంటే ఎక్కువగా వస్తుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. నియోజకవర్గంలోని 4 మండలాల నాయకుల అతి విశ్వాసం అసలుకే ఎసరు తెచ్చింది. మెజార్టీ తగ్గింది. అంతా మేమున్నామని, మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పిన నేతలు.. క్షేత్రస్థాయిలో వైకాపాకు దీటుగా కార్యక్రమాలు చేయలేకపోవడం మెజార్టీపై ప్రభావం చూపింది. వైకాపా ప్రాభవానికి తోడు.. అభ్యర్థి చంద్రమౌళి అనారోగ్యం బారిన పడినా అతడి కుటుంబసభ్యులు ప్రచారంలో పాల్గొని సానుభూతి సంపాదించారు.
నగరి మళ్లీ రోజాదే
తెదేపా నాయకులంతా సమష్టిగా పనిచేసినా అంతరాలు పూర్తిగా పూడలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సరళి, తమిళ, రెడ్డి, ఎస్సీ సామాజికవర్గం ఓట్లు గుంపగుత్తగా పడినందున విజయం ఖాయమై.. స్వల్పమెజార్టీతో బయటపడ్డారు. క్షత్రియులు, కాపులు, బీసీ వర్గాల మద్దతు సమీకరించడంలో తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాశ్ విజయం వెనుకబడింది. తెదేపాకు చివరి నిమిషంలో అనుకూలంగా పనిచేసిన కాంగ్రెస్‌ నాయకుడి చెంగారెడ్డి ప్రభావం కలిసొచ్చినా... విజయ తీరం చేర్చలేదు.
పలమనేరు: మంత్రికి ముచ్చెమటలు!
జిల్లా మంత్రిగా ఉన్న అమర్‌నాథ్‌రెడ్డి ఓటమి స్వయంకృతమేనన్న వాదన విన్పిస్తోంది. తొలిసారి బరిలోకి దిగిన వైకాపా అభ్యర్థి వెంకటేగౌడను తక్కువ అంచనా వేయడం... అతి విశ్వాసం దెబ్బతీశాయన్న చర్చ సాగుతోంది. వైకాపాలో గెలిచ్చి.. తేదేపాలో చేరిన సమయంలో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయలేమి పెద్ద విఘాతంగా పరిణమించింది. సీనియర్‌ నేత సుభాష్‌చంద్రబోస్‌ మద్దతు కూడగట్టినా.. ఫ్యాన్‌ ఉద్ధృతిలో అంతిమంగా వెంకటేగౌడనే విజయం వరించింది.
సత్యవేడు: ఎదురులేని విజయం
తెదేపాకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో కొత్త వ్యక్తి జడ్డా రాజశేఖర్‌ను బరిలోకి దింపినప్పుడే సగం విజయం వైకాపా ఖాతాలో పడిందన్న చర్చ విన్పించింది. స్థానిక నాయకుల మాటను కాదని, పార్టీతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తికి టిక్కెట్‌ ఇవ్వడం కార్యకర్తలకు మింగుడుపడలేదు. జేడీ సైతం అందరితో మాట్లాడి, తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేయలేదు. చాలాచోట్ల పార్టీ కార్యకర్తలు పనిచేయలేదు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లోనూ వైకాపా తొలినుంచి ప్రణాళికతో వ్యవహరించింది. గతంలో ఓడిపోయిన సానుభూతి ఆదిమూలానికి బాగా పనిచేసి.. ఓట్ల వర్షం కురిపించింది.
పూతలపట్టులో వైకాపా పట్టు
ఇక్కడా వైకాపా అనుకూల పవనాలే వీచాయి. కేవలం జగన్‌ మేనియాతో స్థానికేతరుడన్న ముద్రను అధిగమించి విజయం సాధించారు ఎం.ఎస్‌.బాబు. సర్పంచిగా గెలవని స్థానికేతరుడికి నియోజకవర్గ ఓటర్లు పట్టం కట్టడంపై వైకాపా వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన లలితకుమారికి సానుభూతి ఓటింగ్‌ పనిచేయలేదు. కొన్ని గ్రామాల్లో అంతర్గతంగా తెదేపా నాయకులు ప్రతిపక్షానికి సహకరించారన్న వాదన ఇప్పుడు విన్పిస్తోంది.
జీడీ నెల్లూరు : సునాయాస విజయం
పోరాటం చేయలేక, ఐక్యత లేక, వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేక ఇక్కడ తెదేపా వెనుకబడిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. హరికృష్ణ.. నారాయణస్వామికి దీటైన అభ్యర్థి కాదన్న వాదన ముందే విన్పించింది. ఇక ఎస్సీ, ఎస్టీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం ఇక్కడ నాయకులు ఎవరూ చేయలేదు. మొదటి నుంచి ఇది ఓడిపోయే స్థానంగానే లెక్కలు వేసుకున్నారు మినహా.. గెలుపు ప్రయత్నం చేయలేదు.
పీలేరు : ఉత్కంఠ పోరులో చింతల పైచేయి
రౌండురౌండుకు ఉత్కంఠ రేపిన పీలేరు పోటీలో తెదేపా విజయం అంచుల వరకూ వెళ్లి.. పరాజయం చవిచూసింది. మైనార్టీ ఓటర్ల అండ వైకాపాకు కలిసొచ్చింది. నల్లారి కుటుంబానికి ఉన్న ఓటు బ్యాంకు.. పోటీకి పనికొచ్చింది కాని.. విజయతీరాలకు చేర్చలేదు.
పుంగనూరు: ఎదురులేని ‘పెద్ది’రికం!
వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నియోజకవర్గంపై ఉన్న పట్టు మరోసారి రుజువైంది. అనీషారెడ్డి గట్టి పోటీ ఇస్తారని భావించినా.. వైకాపా అనుకూల పవనాల్లో అవేవీ కనిపించలేదు. అన్నీ మండలాల్లో బలమైన కేడర్‌తో పెద్దిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు, నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ప్రక్రియ, రాష్ట్ర వ్యాప్తంగా చివరిగా లెక్కింపు పూర్తి అయిన ఉరవకొండ నియోజకవర్గం. రౌండు..రౌండుకు మారిన ఫలితాలు. అభ్యర్థులకు చివరి వరకు హై టెన్షన్. రెండు ఈవీఎంలు సాంకేతిక సమస్య రావడంతో కాస్త ఆలస్యంగా ఓట్ల లెక్కింపు సాగింది. వీవీ ప్యాట్లను కూడా లెక్కేంచే వరకు ఈ పోలింగ్ ప్రక్రియ సాగింది. చివరకు టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ తన సమీప అభ్యర్థి అయినటువంటి వైస్సార్సీపీ అభ్యర్థి Y. విశ్వేశ్వరరెడ్డి పై 2132 మెజారిటీతో ఘనవిజయం సాధించారు. గెలిచిన అభ్యర్థి పయ్యావుల కేశవ్ కు రిటర్నింగ్ అధికారి D-ఫార్మ్ ఇచ్చారు. అనంతరం అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలో రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది.

Body:బైట్ 1 : పయ్యావుల కేశవ్, టీడీపీ అభ్యర్థి

Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuram (D)
date : 24-05-2019
sluge : ap_atp_71_24_payyavula_kesav_gelupu_avb_c13
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.