ETV Bharat / state

కట్టుకున్న భార్య.. కళ్ల ముందే లోకాన్ని వీడిన వేళ...!

కట్టుకున్న భార్య.. తన కళ్ల ముందే.. తన ఒడిలోనే కాలం చేస్తుంటే.. చూస్తూ ఉండిపోయిన ఓ భర్త నిస్సహాయత ఇది..! ఆయువు పోసేదీ.. ప్రాణం తీసేదీ.. పైసలేనన్న చేదు నిజాన్ని చాటి చెప్పిన సంఘటన ఇది..! విధి చేతిలో ఓడిన అభాగ్యుడు అమరేశ కథ ఇది..!

mahila
author img

By

Published : Sep 10, 2019, 11:38 AM IST

Updated : Sep 10, 2019, 4:03 PM IST

భర్త చేతుల్లో.. తుదిశ్వాస విడిచిన భార్య

ప్రాణం చాలా విలువైందంటారు. కానీ.. డబ్బు ముందు పేదవాడి ప్రాణం విలువ చాలా తక్కువ అని చెప్పే సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చించే స్తోమత లేక.. కట్టుకున్న భార్య.. తన కళ్లముందే కనుమూస్తున్నా ఏమీ చేయలేక.. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు అమరేశ. కర్ణాటకలోని ముల్​బాగళ్ ప్రాంతంలోని బేరకూరుకు చెందిన అమరేశ, శోభ.. కుప్పంలోని ఓ కోళ్ల ఫారంలో కూలీలుగా పనిచేస్తున్నారు. వారి పిల్లలు ఊరిలోని నాయనమ్మ వద్ద ఉంటున్నారు.

ఏం జరిగిందో ఏమో!

భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగిందో... లేక మరేదైనా కారణమో కానీ శోభ కోళ్లఫారంలోని ఈగల మందు తాగింది. భర్త అమరేశ హుటాహుటిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి చేయిదాటింది.. పెద్దాసుపత్రికి తీసుకెళ్తే తప్ప బతకదని తేల్చారు. చేతిలో పైసా లేని అమరప్ప.. భార్యను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కుప్పం బస్టాండులో ఉండగానే శోభ.. కన్నుమూసింది. భార్య తన ఒడిలో కన్నుమూస్తుండగానే.. అమరేశ అసహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ హృదయ విదారక ఘటనను చూసి అందరి కళ్లూ చెమ్మగిల్లాయి.

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటిలో సోమవారం స్వామి వివేకానంద రథయాత్ర అ కొనసాగింది కడప రామకృష్ణ మిషన్ నుంచి స్వామి వివేకనంద ట్రస్ట్ బృందానికి మాసాపేట లోని రింగ్ రోడ్డు వద్ద విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు యువజన సంఘాలు లైన్స్ క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు రింగ్ రోడ్డు నుంచి సాయి ఇంజనీరింగ్ కళాశాల వరకు ర్యాలీగా వచ్చారు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రామకృష్ణ మఠం పర్యవేక్షకులు స్వామి దివ్య ధర్మానంద యువతను ఉద్దేశించి ప్రసంగించారు స్వామి వివేకానంద సూక్తులు వివరించి దేశానికి యువశక్తి అవసరమన్నారు యువత లక్ష్యాన్ని ఎంచుకుని గమ్యం చేరేందుకు విశ్రమించకండి ముందడుగు వేయాలన్నారు స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తిని యువతలో నింపేందుకు రాయలసీమ వ్యాప్తంగా రథయాత్రను కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు కడప కర్నూల్ చిత్తూర్ అనంతపురం నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుందని అనంతరం తమిళనాడులోని రామేశ్వరం చేరుకోవడం జరుగుతుందన్నారు పాదయాత్రకు ఎత్తున యువత స్వాగతం పలికి వివేకానందుని అడుగుజాడల్లో నడిచేందుకు ముందుకు రావడం నందన ఏమన్నారు సమావేశంలో లైన్స్ క్లబ్ సభ్యులు శిరిడి సాయి ఆలయ ట్రస్టు చైర్మన్ కే బయ్యా రెడ్డి భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి ఇ నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాసరాజు యువజన యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం రాయచోటి పట్టణం లోని మాసాయిపేట ట్రంక్ రోడ్ గాంధీ బజార్ కంస వీధి బస్టాండ్ రోడ్ కొత్తపేట ప్రాంతాలలో రథ యాత్ర కొనసాగింది

Body:బైట్ స్వామి దివ్య ధర్మానంద కడప రామకృష్ణ మఠం పర్యవేక్షకులు

Conclusion:బైట్ స్వామి దివ్య ధర్మానంద కడప రామకృష్ణ మఠం పర్యవేక్షకులు
Last Updated : Sep 10, 2019, 4:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.