ETV Bharat / state

పోలీస్​స్టేషన్​లో మహిళపై ఎస్సై దాడి

ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వెళితే ఎస్సై విచక్షణారహితంగా కొట్టాడని ఆరోపిస్తూ... తిరుపతిలో ఓ మహిళ ఆందోళన చేసింది. నగరంలోని ఎమ్మార్ పల్లి పోలీస్​స్టేషన్ ఎదుట తన సోదరితో కలిసి నిరసన చేపట్టిన బాధితురాలు... తనకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదంటూ ఠాణా ఎదుట బైఠాయించింది.

women-protest-to-demand-take-action-on-emmarpalli-si-in-thirupathi
పోలీస్​స్టేషన్ ఎదుట మహిళ ఆందోళన
author img

By

Published : Dec 6, 2020, 6:37 AM IST

పోలీస్​స్టేషన్ ఎదుట మహిళ ఆందోళన

తిరుపతిలోని ఉప్పరపల్లెకు చెందిన వనితావాణి... ఆటో నడపుతూ జీవనం సాగిస్తోంది. ఇంటి వద్ద పొరుగు వారితో ఏర్పడిన ఘర్షణపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మార్​పల్లి పోలీస్​స్టేషన్​కు వెళ్లింది. స్టేషన్ ఎస్సై ప్రకాష్​ను కలవగా... వెంటనే స్టేషన్ నుంచి బయటకి పొమ్మంటూ తనపై దాడికి పాల్పడ్డాడని వాపోయింది. ఎస్సై అనుచిత ప్రవర్తనతో ఆవేదన చెందిన బాధితురాలు...న్యాయం చేయాలంటూ తన సోదరితో కలిసి ఠాణా ఎదుట బైఠాయించింది. బాధితురాలితో మాట్లాడిన సీఐ సురేంద్రనాథ్​రెడ్డి... ఈ ఘటనపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీచదవండి.

ఇదీ చదవండి: రైతు దీక్ష: కొలిక్కిరాని చర్చలు- 9న మరో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.