రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉండగా.. ఓ యువతి ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మిట్టపాళ్యంలో జరిగింది. గ్రామానికి చెందిన యువతికి తల్లిదండ్రులు గురువారం(17-06-2021)న నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఇంతలోనే యువతి ఇంట్లో ఉన్న రూ.4 లక్షలు, వంద గ్రాముల బంగారంతో పరారైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: