చిత్తూరు నగరం మిట్టూరు రాగిమాను వీధికి చెందిన.. లత అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన ఏడు సంవత్సరాల తరువాత అదనపు కట్నం కోసం.. తమ కుమార్తెను మృతురాలి భర్త సురేష్, అత్త గంగ వేధిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. వరకట్న వేధింపులు తట్టుకోలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ కన్నీరుమున్నీరయ్యారు. లత భర్తను శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: చంద్రబాబు సొంత పంచాయతీలో తెదేపా మద్దతుదారు విజయం