చిత్తూరు జిల్లా రామకుప్పం మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పెట్రోల్ సీసాతో ఓ మహిళ హల్చల్ చేసింది. తనకున్న 65 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నా... అధికారులు చర్యలు తీసుకోలేదని నక్కబాలయ్యపల్లెకు చెందిన సునంద వాపోయింది. పెట్రోల్ సీసాతో ఆందోళన చేసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, సమస్య పరిష్కారనానికి ఆర్.ఐ, వీఆర్‌ఓ లంచం అడిగారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీచదవండి.