కోవిడ్ అనంతరం భారతీయ పరిశ్రమలు, వాటి పరిశోధనల, అభివృద్ధి అంశాల్లో రూపొందించుకోవాల్సిన ప్రణాళికలు, జాగ్రత్తలపై ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం జాతీయ స్థాయి వెబినార్ నిర్వహించింది. నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వి.కె.సారస్వత్ అధ్యక్షతన జరిగిన వెబినార్‌కు... ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, వైస్‌ఛాన్సలర్ నారాయణరావు తిరుపతి నుంచి అనుసంధాన కర్తగా వ్యవహరించారు. వెబినార్‌లో డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్‌రెడ్డి, శాంతబయోటిక్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, ఐఐటీలతో పాటు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఆచార్యులు, శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక రంగాల్లో నిపుణులు ఈ వెబినార్‌లో తమ అభిప్రాయాలు వెల్లడించారు. దేశంలోని వివిధ రకాల పరిశ్రమలు, వాటి పరిశోధన అభివృద్ధి రంగాల్లో త్వరగా పుంజుకొనే అవకాశాలపై చర్చ జరిగింది. వెబినార్‌లో పాల్గొన్న వి.కె.సారస్వత్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించిందన్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో వివిధ సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. పరిశోధన, అభివృద్ధి రంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వరంగ పరిధిలోని పరిశోధన, అభివృద్ది సంస్థలు సమష్టిగా పనిచేయడం ద్వారా అనుకొన్న లక్ష్యాలను సాధించగలుగుతామని డీఆర్‌డీఓ ఛైర్మన్ అన్నారు.
'పరిశోధన, అభివృద్ధి రంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరముంది' - డీఆర్‌డీఓ ఛైర్మన్‌తో వెబ్‌నార్
కోవిడ్ అనంతరం భారతీయ పరిశ్రమలు, వాటి పరిశోధనల, అభివృద్ధి అంశాల్లో రూపొందించుకోవాల్సిన ప్రణాళికలపై ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం జాతీయ స్థాయి వెబినార్ నిర్వహించింది. నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వి.కె.సారస్వత్ అధ్యక్షతన జరిగిన ఈ వెబినార్‌కు... ఎస్‌ఆర్‌ఎమ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వైస్‌ఛాన్సలర్ నారాయణరావు తిరుపతి నుంచి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.