చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం పెద్దేరు వాగుపై నిర్మించిన పెద్దేరు ప్రాజెక్టు నీవర్ తుపాను ప్రభావంతో జోరుగా పొంగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో మొదలైన వాగు పెద్దతిప్ప సముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల మీదుగా ప్రవహించి ..కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు జలాశయంలోకి చేరుతుంది. మూడు మండలాల పరిధిలో 5వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో.. వరిపంట కోతకు గురైంది. కొద్దిరోజుల్లో కోయాల్సిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యటకులను ప్రాజెక్టు దగ్గరికు వెళ్లనీయకుండా దూరం నుంచి చూసే విధంగా తంబళ్లపల్లె ఎస్ఐ సహదేవి బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి.