చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎస్పీ రమేష్ రెడ్డి సందర్శించారు. పోలీస్ స్టేషన్ల ఆధునీకరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తుడా పరిధిలోని ఒక్కో పోలీస్ స్టేషన్ కోసం రూ.20 లక్షల నిధులు వెచ్చించనున్నారు.
చంద్రగిరి పీఎస్లో పార్కు, జిమ్, వాకింగ్ ట్రాక్, ఇండోర్ స్టేడియం ఏర్పాటుపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. పోలీసు క్వార్టర్స్ స్థలంలో పబ్లిక్ పార్కు ఏర్పాటు చేయటానికి కోటి రూపాయల తుడా నిధులు వెచ్చించనున్నారు.
ఆక్రమణకు గురైన క్వార్టర్స్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని... స్థానిక సీఐని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధమ్మ, తహసీల్దార్ చంద్రమోహన్, డీఎస్పీ నరసయ్య పాల్గొన్నారు.
ఇదీ చదవండి: